Telugu Life Quotes - లైఫ్ కోట్స్

Telugu Life Quotes - లైఫ్ కోట్స్

Largest Collection of Life Quotes in Telugu – Top Best Life Quotes, Status & Shayari in Telugu. All New Daily Updated Collection of Motivational and Inspirational life Quotes, status, shayari and images in Telugu for whatsapp , facebook & instagram.

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.

నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.

అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.

ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

నీవు ప్రతీరోజు ఒకటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు, అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.

జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.

నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.

నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి.

మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా మార్చవచ్చు.

ఏడ్చనివాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైన వాడు.

నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది.

సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు.

ఒక్క అడుగు ప్రారంభిస్తే వేయి మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది.

ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతీ లక్షాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు.

అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంగా అయినా మారాలి.

అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.

మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము.

అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి.

ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది.

పదిమంది మనం చేసే ప్రతీ పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.

మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోహం రెట్టింపవుతుంది. అలాగే విషాదం సగం అవుతుంది.

అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.

ఆత్మ విశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం.

కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు.

మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.

గడ్డివామును తగలబెట్టడం వలన సముద్రం వేడెక్కలేదు. ఎవరో విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు.

ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.

కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారుపోసినంత మాత్రాన పంట పండదు కదా.

చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.

ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం వెయ్యి కోరికలు తీర్చుకున్నా లభించదు.

నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేనెంత కష్ట పడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు మన కృషితోనే ఉంటుంది.

రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు.

నేను క్షమిస్తాను, దాని అర్థం ఇతరుల ప్రవర్తనని అంగీకరించానని కాదు, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని.

ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి.

జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావలసింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే.

తన ఆశయాలకు పనిచేయక సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం.

నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినపుడు, నీ ఆశయాలను పూర్తిచేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది.

విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు. తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు.

జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది, మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి.

అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది.

గొప్ప పనులు చేయలేనివారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు.

ఎక్కువగా వేచి చూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.

ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. మన ఈ రోజటి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు.

జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కావలసింది కేవలం మన అంగీకారమే.

మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు. దానిని వృద్ధి చేయటానికి అయి ఉండాలి.

జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది.

We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.